News March 3, 2025
భైంసా: మాల్ ప్రాక్టీస్ కింద ముగ్గురు విద్యార్థులు బుక్

భైంసా: గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో ఇవాళ 3 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద పట్టుబడ్డట్లు చీఫ్ సూపరింటెండెంట్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. కాగా పరీక్షలు నిన్న ప్రారంభమవగా తొలిరోజు 8 మంది విద్యార్థులు, ఇవాళ ముగ్గురు మొత్తంగా 11 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అయ్యారన్నారు.
Similar News
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం: డిప్యూటీ సీఎం

ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నిలబెట్టుకుంటోందని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి స్పష్టం చేశారు.
News September 17, 2025
వరంగల్: స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం..!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం సృష్టించింది. నిన్న రాత్రి పసుపు కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. ఉదయం స్కూల్ తెరిచి సరికి చూసి ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
క్షుద్రపూజల ఆనవాళ్లతో గ్రామస్థులు, పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.