News March 12, 2025
భైంసా: మాల్ ప్రాక్టీస్.. నలుగురు విద్యార్థులు బుక్

భైంసా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓపెన్ డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ నలుగురు విద్యార్థులు బుక్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య పేర్కొన్నారు. ఈ సెంటర్లో ఇప్పటివరకు జరిగిన 5వ, 3 వ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 20 మంది విద్యార్థులు బుక్ అయినట్లు వెల్లడించారు.
Similar News
News January 28, 2026
సంగారెడ్డి: ‘ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలి’

ఎన్నికల విధులలో అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పాండు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టాటిక్ సర్వే లైన్స్, ఫ్లయింగ్ స్కాట్స్ నిఘా బృందాల అధికారులకు జోనల్ అధికారులకు బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ తరగతులు నిర్వహించారు. తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంయమనంతో వ్యవహరించాలని ఎన్నికల వ్యయ ప్రచార సరళీని తనిఖీ చేయాలన్నారు.
News January 28, 2026
ఎమ్మెల్యేకు నేనే రూ.7 లక్షలు ఇచ్చాను: బాధితురాలు

తన డిమాండ్ డబ్బు కాదని, కేవలం రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు చట్ట ప్రకారం శిక్ష పడాలని బాధితురాలు కోరింది. మీరు ఎమ్మెల్యేను రూ.25 కోట్లు డిమాండ్ చేశారంట కదా అని అడగగా.. ఎమ్మెల్యే దగ్గర ఏం లేదని, ఆయనకే తానే రూ.7 లక్షలు ఇచ్చానని ప్రెస్‌మీట్లో చెప్పుకొచ్చారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎక్కడికైనా వస్తానని తెలిపారు.
News January 28, 2026
నరసాపురం: అంతర్వేది ఉత్సవాలకు పటిష్ఠ బందోబస్తు

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవానికి భక్తుల రక్షణార్థం పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన, వీడియో ప్రజెంటేషన్ ద్వారా భద్రతా చర్యలను పరిశీలించారు. గోదావరి తీరంలో కళ్యాణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


