News September 5, 2025
భైంసా: మోదీ చిత్రపటానికి ఎమ్మెల్యేల పాలాభిషేకం

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఇతర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తూ భైంసాలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Similar News
News September 5, 2025
నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్

భూపాలపల్లి పట్టణంలో గణపతి నిమజ్జనం సందర్భంగా ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
News September 5, 2025
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: మంత్రి టీజీ భరత్

కర్నూలు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై మెడికల్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి టీజీ భరత్ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, హాస్పిటల్ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో ఆయన చర్చించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అంతకు ముందు పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ ప్రతినిధులు మంత్రి చేతుల మీదుగా 10 స్ట్రెచర్లను హాస్పిటల్‌కు ఇచ్చారు.
News September 5, 2025
ఉత్తమ ప్రిన్సిపల్‌గా అవార్డు అందుకున్న ADB వాసి

బోధన, అభ్యాసం, పరిపాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బోథ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డుకు ఎంపికయ్యారు. టీచర్స్ డేను పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ‘గురుపూజోత్సవం’ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు