News January 25, 2025
భైరవపట్నంలో అగ్ని ప్రమాదం

మండవల్లి మండలంలోని భైరవపట్నం , ప్రత్తిపాడు స్టేజీ వద్ద నివాసముంటున్న పిట్టలోళ్ల గుడిసెలు ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి దగ్ధమయ్యాయి. 30 గుడిసెలలోని 25 కుటుంబాల వాళ్లు నిరాశ్రయులయ్యారు. దోమల నివారణకు వెలిగించిన నిప్పు ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. స్థానికులు గాయపడ్డ పది మందిని కైకలూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News July 4, 2025
వరంగల్ పోక్సో కోర్టు పీపీగా వెంకటరమణ

వరంగల్ జిల్లా పోక్సో కోర్టు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గంప వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2007లో లా పట్టా పొంది, జిల్లా న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రమణకు ఈ అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
News July 4, 2025
పాలమూరు: కొత్త రేషన్ కార్డ్.. ఇలా చేయండి!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, పేర్లు చేర్చడంపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే మొదట సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తల్లిదండ్రుల కార్డుల నుంచి పేర్లను తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News July 4, 2025
ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్

అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా అరికట్టాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలంలో స్టాక్ యార్డుల ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.