News December 21, 2025

భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

image

భోగాపురం మండలం సవరవల్లి–తూడెం మార్గం ద్వారా భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రహదారిపై మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను 5, 6 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు.

Similar News

News December 30, 2025

డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు: కలెక్టర్

image

ఎరువుల విక్రయంలో నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం, రాబోయే పంటలకు అవసరమైన ఎరువులను గ్రామ, మండలాల వారీగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వచ్చే 15 రోజులకు అవసరమైన ఎరువుల అంచనాలను తెలియజేయాలన్నారు.

News December 29, 2025

VZM: రెవెన్యూ క్లినిక్‌లకు 23 దరఖాస్తులు

image

జిల్లాలో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ లకు 23 దరఖాస్తులు అందాయి. అందులో విజయనగరం డివిజన్‌కు 15, బొబ్బిలి డివిజన్‌కు 5, చీపురుపల్లి డివిజన్‌కు 3 దరఖాస్తులు అందాయి. వివిధ భూ సమస్యల పరిష్కార నిమిత్తం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారని ఆయా డివిజనల్ అధికారులు పేర్కొన్నారు. విజయనగరంలో ఆర్డీఓ కీర్తి ధరఖాస్తులు స్వీకరించారు.

News December 29, 2025

వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ప్రజల నుంచి 19 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 8, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలపై 7 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వాస్తవాలను పరిశీలించి, 7 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.