News January 13, 2026
భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.
Similar News
News February 10, 2026
పాక్‌తో మ్యాచ్.. USA టార్గెట్ ఎంతంటే?

T20 WC USAతో మ్యాచులో పాకిస్థాన్ 190/9 రన్స్ చేసింది. 16 ఓవర్ల వరకు పాక్‌ను కాస్త కట్టడి చేసిన అమెరికా బౌలర్లు చివర్లో పరుగులు సమర్పించుకున్నారు. PAK బ్యాటర్లలో ఫర్హాన్ 73, బాబర్ 46 రన్స్‌తో రాణించారు. చివర్లో షాదాబ్ ఖాన్(12 బంతుల్లో 30 రన్స్) బ్యాట్ ఝళిపించారు. USA బౌలర్లలో షడ్లే 4 వికెట్లతో సత్తా చాటారు. మోహ్‌సిన్, హర్మీత్, నేత్రావల్కర్ తలో వికెట్ తీశారు. ఆ జట్టు టార్గెట్ 191 రన్స్.
News February 10, 2026
బాబ్రీ మసీదు నిర్మాణం జరగదు: UP CM యోగి

బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పటికీ జరగదని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘రామ్ లల్లా కోసం వస్తామని, ఆలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఖయామత్ దినం రాదనేది నిజం. అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుంది? దాని గురించి కలలు కనొద్దు’ అని బారాబంకి సభలో అన్నారు. WB ముర్షిదాబాద్‌లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ లక్నో నుంచి మార్చ్ చేయనున్నట్టు హిందూ సంస్థలు ప్రకటించాయి.
News February 10, 2026
వాస్తుకు లేని స్థలాల్లో ఇల్లు కట్టుకోవచ్చా ?

వాస్తు లేని స్థలంలో ఇల్లు కట్టాల్సి వస్తే, రోడ్డును బట్టి సరైన ప్లాన్ రూపొందించుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇంటి చుట్టూ 4 వైపులా ఖాళీ స్థలం వదలాలి. గాలి, వెలుతురు ప్రతి గదిలోకి ప్రవహించేలా చూసుకోవాలి. నీటి వసతికి ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా నిర్మించుకోవాలి. వీటితో ఇంటికి జీవశక్తి పెరుగుతుంది. ఆందోళన అనవసరం. ప్రాథమిక సూత్రాలు పాటించడమే అసలైన వాస్తు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


