News January 13, 2025
భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి నేడు మీరూ భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
Similar News
News January 13, 2025
నేర ప్రవృత్తికి స్వస్తి పలికి.. మంచి పౌరులుగా జీవించాలి: ఎస్పీ
రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారు, చెడు నడత కలిగిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పి మంచి పౌరులుగా జీవించాలన్నారు. ఆదివారం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.
News January 12, 2025
గ్రీన్‌కో ఎనర్జీ ప్రాజెక్ట్ దేశానికే తలమానికం: మంత్రి టీజీ భరత్
ఓర్వకల్లు మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్‌కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దేశానికే తలమానికమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రాజెక్టును 2014లో తమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకున్న ముందు చూపుతో రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు.
News January 12, 2025
కర్నూలు: కిడ్నాప్ కేసులో బాలుడి కథ సుఖాంతం
గత నెల 20న కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి కథ సుఖాంతం అయ్యిందని కర్నూలు డీఎస్పీ జే.బాబు ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వివరాలను ఆదివారం వెల్లడించారు. కిడ్నాప్ కేసులో భాగంగా పోలీసులు జిల్లా మొత్తం తనిఖీలు చేపట్టడంతో గత అర్ధరాత్రి నిద్రపోతున్న ఓ జంట వద్ద దుండగులు బాలుడిని వదిలి వెళ్లిపోయారు. వారు పోలీసులకు తెలపడంతో తల్లిదండ్రులను పిలిపించి బాలుడి అప్పజెప్పారు.