News April 15, 2025
భోగేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ పూజలు

గడివేముల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గా భోగేశ్వరస్వామి ఆలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సోమవారం పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన కలెక్టర్ రాజకుమారికి ఆలయ ఈఓ రామానుజన్, ఆలయ అర్చకులు శ్యాంసుందర్ శర్మ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేపట్టారు. దర్శనం అనంతరం స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించారు.
Similar News
News October 18, 2025
NLG: టెండర్ల జాతర.. ఒక్క షాపుకే 100 దరఖాస్తులు !

ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లాలో 329 షాపులకు టెండర్లు స్వీకరిస్తున్నారు. అయితే నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్ కోసం 100కు పైగా టెండర్లు దాఖలైనట్లు సమాచారం. నేడు బంద్ కారణంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికీ DDలు తీసి ఉంటే రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News October 18, 2025
అఫ్గాన్ నుంచి టిప్స్ తీసుకోండి.. BCCI, కేంద్రంపై శివసేన ఫైర్!

పాక్ దాడుల్లో క్రికెటర్ల మృతితో ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు అఫ్గాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో Asia Cupలో పాక్‌తో టీమ్ ఇండియా ఆడటాన్ని గుర్తు చేస్తూ శివసేన(UBT) ఫైర్ అయింది. క్రీడల కంటే దేశానికి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో Afghan నుంచి BCCI, కేంద్రం టిప్స్ తీసుకోవాలని మండిపడింది. PAKతో సిరీస్‌ను Afghan రద్దు చేసుకోవడం ఆనందం కలిగించిందని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు.
News October 18, 2025
నిర్మల్: సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ ఏర్పాటు

జీవో నంబర్ 317 ప్రకారం తమ సొంత జిల్లా స్థాయి కేడర్‌లో మారి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బదిలీ కోరే ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే 9000906181 నంబర్‌కు సంప్రదించాలన్నారు. దీంతో సాంకేతిక సమస్యలు నివృత్తి చేసుకోవచ్చని వివరించారు.