News August 5, 2025

మంగళగిరిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

image

చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాల వద్ద జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్, శాసనమండలి సభ్యుడు పెందుర్తి వెంకటేశ్వరరావు, సీఎం పర్యటనకు సంబంధించి పనులను పరిశీలించారు. చేనేత కుటుంబాలతో సమావేశమయ్యే ప్రదేశంలో పలు సూచనలు చేశారు.

Similar News

News September 9, 2025

GNT: అమ్మకు కష్టం వస్తే.. ఆశ్రయం కల్పించారు

image

తక్కెళ్లపాడు రోడ్డులో సోమవారం ఓ వృద్దురాలు దీనస్థితిలో పడి ఉండటం స్థానికులను కలిచివేసింది. గుర్తుతెలియని వ్యక్తులు వృద్దురాలిని వదిలి పెట్టి వెళ్లడంతో స్థానికులు పాతగుంటూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ టీమ్ ఆ వృద్దురాలికి సపర్యలు చేసి పొన్నూరు గోతాలస్వామి ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.

News September 8, 2025

Way2News ఎఫెక్ట్.. దుర్గగుడికి వైద్యుల కేటాయింపు

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో వైద్యులు లేకపోవడంపై Way2Newsలో కథనం ప్రచురితమైంది. ఈ విషయంపై DMHO సుహాసిని స్పందించారు. సోమవారం ఇద్దరు వైద్యులను దుర్గగుడికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తపేట ఏరియాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేశ్ బాబు, కృష్ణలంకలో పనిచేస్తున్న డాక్టర్ ఉదయ్ కృష్ణలను డిప్యూటేషన్‌పై దుర్గగుడిలో పనిచేయాలని ఆదేశాలు అందాయి. దీంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

News September 8, 2025

CBI పేరుతో రూ.62.25 లక్షలు ఫ్రాడ్

image

గుంటూరు భారతపేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని, మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే క్లియరెన్స్ కోసం రూ.62.25 లక్షలు కట్టాలనడంతో నగదు చెల్లించాడు. అయినా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూనే ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.