News January 31, 2025
మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

మంగళగిరి పరిధి ఎన్నారై వై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వై జంక్షన్ వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు ఈ సందర్భంగా కోరుతున్నారు.
Similar News
News March 13, 2025
తుళ్లూరు: మైక్రోసాఫ్ట్‌తో లోకేశ్ కీలక ఒప్పందం

రాష్ట్రంలోని యువతకు ఎఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో గురువారం మంత్రి లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇస్తుందని లోకేశ్ తెలిపారు.
News March 13, 2025
GNT: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు.
News March 13, 2025
గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్‌కి చెందిన ఓ వైద్యురాలు అరండల్‌పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్‌గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.