News March 9, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 9, 2026
12న రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారి టి.శ్రీదేవి సోమవారం తెలిపారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గృహహింస, ఇతర అన్యాయాలకు గురయ్యే మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.
News March 9, 2026
గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.
News March 9, 2026
అప్పటిదాకా పెట్రోల్ రేట్లు పెరగవు: ప్రభుత్వ వర్గాలు

దేశంలో అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని, ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్‌కు) చేరే దాకా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. చమురు రేటు బ్యారెల్‌కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుంది. దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదు. వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది’ అని వివరించాయి.


