News April 11, 2025

మంగళగిరి: చేబ్రోలు కిరణ్‌కు 14 రోజుల రిమాండ్

image

మంగళగిరి కోర్టు చేబ్రోలు కిరణ్‌కు 14రోజుల రిమాండ్ విధించింది. జగన్‌ సతీమణిపై దూషణలకు పాల్పడ్డారనే కేసులో కిరణ్‌పై కేసు నమోదైంది. ఈ సందర్భంగా కేసులో 111సెక్షన్‌ను లాగడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని ఇష్టానుసారంగా వాడటాన్ని తప్పుబడుతూ మంగళగిరి సీఐ శ్రీనివాసరావుపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐకి ఛార్జ్‌మెమో ఇవ్వాలని, లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

Similar News

News January 28, 2026

గుంటూరు: DLSAలో పోస్టులు.. ఈ నెల 30 వరకు ఛాన్స్

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధలో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు. తమ దరఖాస్తులను గుంటూరు జిల్లా కోర్టులో అందే విధంగా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లో పంపించాలన్నారు. పోస్టులు, విద్యార్హత, ఇతర వివరాలను జిల్లా కోర్టు వెబ్సైట్‌ను http//Guntur.dcourts.gov.in ద్వారా పొందవచ్చని అన్నారు.

News January 27, 2026

తెనాలిలో దారుణం.. భార్యను చంపి భర్త పరార్

image

తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. డిపో రోడ్డుకు చెందిన శిరీష (26)ను భర్త సాయి గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. భార్యపై అనుమానంతో కొద్ది రోజులుగా ఘర్షణ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గొడవ జరగడంతో ఆమెను గొంతు నులిమి పరారయ్యాడు. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News January 27, 2026

సచివాలయ సీఎస్ఓకు ఇండియన్ పోలీస్ మెడల్

image

ఏపీ సచివాలయ సీఎస్ఓ పి.వి.ఎస్.ఎన్.మల్లికార్జునరావుకు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (MSM) లభించింది. 36 ఏళ్ల క్రమశిక్షణాయుత సేవలకు గుర్తింపుగా, గణతంత్ర దినోత్సవం వేళ కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. కృష్ణా జిల్లాకు చెందిన మల్లికార్జునరావు గతంలో ఐటీబీపీ, ఏపీఎస్పీఎఫ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఎఫ్ అధికారులు ఆయన్ను అభినందించారు.