News August 20, 2024
మంగళగిరి జనసేన కార్యాలయంలో మినీ మ్యూజియం

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినియేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు, శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ మేరకు మంగళవారం పవన్ మ్యూజియంలో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
Similar News
News November 7, 2025
GNT: సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్

సీఎం చంద్రబాబును గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడికొండ మండలం లాం గ్రామంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించి స్వాగతం పలికారు.
News November 7, 2025
తుఫాన్ సెలవులు భర్తీ.. రెండవ శనివారం కూడా స్కూల్లు

తుఫాను కారణంగా గత నెలలో ఇచ్చిన 4 రోజుల సెలవులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి నెల వరకు 2వ శనివారం సెలవులను రద్దు చేస్తూ డీఈవో సివి రేణుక ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి 2వ శనివారం నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం వరకు 4 రోజులు అన్ని విద్యా సంస్థలు తప్పనిసరిగా నడపాలని డీఈఓ ఆదేశించారు. దీంతో 4 నెలల పాటు స్కూల్లకు 2వ శనివారం సెలవులు రద్దయ్యాయి.
News November 7, 2025
వందేమాతర ఉద్యమంలో గుంటూరు పాత్ర

వందేమాతర నినాదం స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905–11మధ్య ‘వందేమాతర యుగం’గా ప్రసిద్ధి చెందింది. ఈ పోరాటం ఉధృతి గుంటూరు జిల్లాలో మహోజ్వలంగా కొనసాగింది. చేబ్రోలులోని రెడ్డిపాలెం రైతు చిన్నపరెడ్డి బ్రిటిష్ పోలీసు అధికారిపై తిరగబడ్డారు. తుపాకీతో తన ఎద్దును కాల్చడంతో ఆగ్రహించిన చిన్నపరెడ్డి, ఇతర రైతులతో కలిసి అధికారిని చితకబాదారు. ఈ నేరానికి ఆంగ్ల ప్రభుత్వం చిన్నపరెడ్డి సహా ముగ్గురికి ఉరిశిక్ష విధించింది.


