News March 25, 2025

మంగళగిరి: ప్రజా క్షేత్రంలో కనిపించని ఆర్కే

image

మంగళగిరి మాజీ ఎమ్మెల్యే YCP నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి RK నియోజకవర్గంలో అందుబాటులో లేరు. కనీసం కార్యకర్తలకు, అనుచరులకు సైతం కనిపించకపోవడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. చివరి ఎన్నికల్లో YCP తరపున పోటీ చేసిన మురుగుడు లావణ్య, కాండ్రు కమల ప్రజా క్షేత్రంలో కనిపించకపోవడం గమనార్హం.

Similar News

News March 28, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన భధ్రతా సీళ్లు, సీసీ కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట అధికారులు పాల్గొన్నారు.

News March 27, 2025

గుంటూరు జిల్లాలో గెలిచిన వారి వివరాలు

image

గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ముగిశాయి. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు (TDP) ఉప సర్పంచ్‌గా నాగమల్లేశ్వరరావు గెలుపొందారు. గుంటూరు రూరల్ మండల ఉపాధ్యకుడిగా కాకాని రమేష్(YCP), దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా షేక్ జబీన్(TDP), తెనాలి కోఆప్షన్ సభ్యుడిగా సయ్యద్ జానీ బాషా(YCP), కొల్లిపర మండలం (YCP) తూములూరు ఉప సర్పంచ్‌గా ఆరుమళ్ల శివారెడ్డి ఎన్నికయ్యారు.

News March 27, 2025

గుంటూరు: సీఎం చంద్రబాబుకు నాదెండ్ల స్వాగతం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పోలవరం చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి నాదెండ్ల ప్రాజెక్టు గురించి పలు విషయాలు వివరించారు. అనంతరం నిర్వాశితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

error: Content is protected !!