News August 29, 2024

మంగళగిరి యువతికి గోల్డ్ మెడల్

image

మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిశారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి జరుగుతున్న జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ కొట్టారు.

Similar News

News February 26, 2026

జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో 20 కేంద్రాల్లో NEETపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతిలో 20 కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. గురువారం న్యూ ఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు.

News February 26, 2026

సమర్థవంతంగా మ్యూటేషన్ చేయాలి: కలెక్టర్

image

తప్పులు లేని మ్యుటేషన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారుల సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి చేయాలన్నారు. మ్యుటేషన్ అనే అంశం రెవెన్యూ శాఖకు ప్రాథమిక విధి అన్నారు. ఎటువంటి తప్పులు దొర్లినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

News February 26, 2026

డోలిమోతల నడుమ ప్రసవించడం బాధాకరం: రాయపాటి శైలజ

image

అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మల్లిపాడు గ్రామానికి చెందిన సుమిత్ర డోలిమోతల నడుమ టార్చి లైట్ వెలుగుల్లో ప్రసవించడం బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన గర్భిణీలను ప్రసవానికి 15 రోజుల ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చి వైద్యుల పర్యవేక్షణలో సుఖ ప్రసవా జరిగే కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు.