News October 20, 2024
మంగళగిరి: రేపటి నుంచి పానకం రూ.30
మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి ఒక బిందె పానకం రూ.30 రూపాయలకే భక్తులకు అందిస్తున్నట్లు దేవస్థాన ఈవో అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 నిమిషాల వరకు పానకం నివేదన ఉంటుందని చెప్పారు.
Similar News
News November 23, 2024
గుంటూరు జిల్లా TODAY TOP NEWS
★ గుంటూరు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
★ మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
★ గుంటూరు: కారంచేడు రైల్వే గేటును ఢీ కొన్న కారు
★ గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
★ వినుకొండ: స్నానానికి వెళ్లిన స్వాములు.. ఇద్దరు మృతి
★ దాచేపల్లిలో డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి
News November 22, 2024
శాంతిభద్రతల ఏఎస్పీ రవికుమార్ బాధ్యతల స్వీకరణ
గుంటూరు జిల్లా శాంతి భద్రతల విభాగ ఏఎస్పీగా రవికుమార్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ప.గో జిల్లా ఏఎస్పీగా ఉన్న రవికుమార్ గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మెక్కను అందించారు. జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
News November 22, 2024
గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.