News March 26, 2025

మంగళగిరి రైల్వే వంతెనకు కేంద్రం ఆమోదం

image

మంగళగిరి నగరంలోని నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్‌ల వినతుల మేరకు మంగళవారం ఎల్సీ 14వద్ద ఆర్వోబీనీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సుమారు రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో.. కిలోమీటరు మేర 4 వరుసల రైల్వే వంతెన నిర్మాణం కానుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే అటు రాజధానితో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉపయోగకరంగా ఉంటుంది.

Similar News

News November 4, 2025

తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

image

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్‌ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

News November 3, 2025

GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

image

రైతులు CM యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్‌లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.

News November 3, 2025

ANU: వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఒకటి నుంMR ప్రారంభం కానున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ వ్యాయామ విద్య పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం సాయంత్రం తెలిపారు. పరీక్ష ఫీజు, తదితర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.