News June 23, 2024

మంగళగిరి: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకుల మృతి

image

సముద్ర స్నానానికి వెళ్లి మంగళగిరి యువకులు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళగిరికి చెందిన 12మంది యువకులు ఆదివారం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని రామాపురం బీచ్‌కు వెళ్లారు. వీరంతా సముద్ర స్నానానికి దిగగా.. ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిని బాలసాయి(26), బాలనాగేశ్వరరావు(27)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల ఈ బీచ్‌లో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే.

Similar News

News January 7, 2026

రాజధాని అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్.!

image

మంగళగిరి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పశ్చిమ బైపాస్ సంక్రాంతికి పాక్షికంగా అందుబాటులోకి తేవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నిర్ణయించారు. అమరావతి రాజధానిలో కీలకంగా నిలవనున్న ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే NH 16, విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. చినకాకాని నుంచి గొల్లపూడి వరకు 17.636 కిలోమీటర్ల మేర రూ.1,546 కోట్ల వ్యయంతో బైపాస్ నిర్మాణాన్ని చేపట్టారు.

News January 7, 2026

GNT: ధరల పతనానికి బ్రేక్‌.. మిర్చి మార్కెట్‌లో ప్రభుత్వం ఫుల్‌ కంట్రోల్

image

గతేడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన సమీక్షలో మిర్చి ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉత్పాదకత 44 శాతం తగ్గిందని, రైతులకు నష్టమేమీ కలగకుండా ఇ-క్రాప్ 100 శాతం అమలు, రసీదులు తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2026

GNT: గుడ్ న్యూస్.. వారికి కేవలం రూ.1కే నెలంతా ఫ్రీ

image

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.