News February 13, 2025
మంగళగిరి: 35 మంది కార్యకర్తలకు ముందస్తు బెయిల్

2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పలు ప్రాంతాలకు చెందిన 35 మంది వైసీపీ కార్యకర్తలపై గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి వైవీఎస్బీజీ పార్థసారథి దాడి కేసులో 35 మంది వైసీపీ కార్యకర్తలకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో నిందితుల తరపున వైసీపీ లీగల్ సెల్ వాదించారు.
Similar News
News November 9, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.
News November 9, 2025
GNT: సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు నేడు పెదకాకానిలోని శంకర ఐ హాస్పిటల్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చేసిన ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం పర్యటించి పరిశీలించారు. ఏర్పాట్లని పక్కాగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News November 8, 2025
తుళ్లూరు: APCRDA ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ

APCRDA ఆధ్వర్యంలో VIT- AP యూనివర్సిటీలో రాజధాని ప్రాంత మహిళలకు హౌస్ కీపింగ్‌లో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. శనివారం నుంచి 15 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది మహిళలు శిక్షణకు హాజరుకాగా పలువురు అధికారులు పాల్గొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత రవాణా సదుపాయం ఉంటుందని, రాజధాని ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


