News July 28, 2024

మంగళగిరి: ANUలో రేపు ఐసెట్ కౌన్సెలింగ్

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఎంబీఏ జనరల్, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు నిర్వహించిన ఐసెట్‌లో అర్హత సాధించిన వారికి సోమవారం కౌన్సెలింగ్ ఏర్పాటుచేశామని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు.  ఎంబీఏలో 10, ఎంసీఏలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ANU ఐసెట్‌లో అర్హత సాధించిన వాళ్లంతా రేపు ఉదయం పీజీ ప్రవేశాల విభాగానికి రావాలని చెప్పారు. 

Similar News

News September 30, 2024

లడ్డూలా దొరికిపోయిన బాబు: అంబటి రాంబాబు

image

తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను నేడు సుప్రీం కోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘లడ్డు ప్రసాదం విషయంలో రాజకీయ ఆరోపణలు చేసి లడ్డులా దొరికిపోయిన బాబు!’ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

News September 30, 2024

US కాన్సులేట్ ప్రతినిధులతో మంత్రి అనిత సమావేశం

image

రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్ నానక్ రామ్ గుడ లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వీసా అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై హోం మంత్రి చర్చించారు. అమెరికా వెళ్లాలనుకునే వారు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని అన్నారు. వీసా అప్లికేషన్ సిస్టం సులభతరం చేయవలసిందిగా హోమ్ మంత్రి కోరగా యూఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారన్నారు.

News September 30, 2024

గుంటూరు: నేటి నుంచి ఇళ్లకు ఉచిత ఇసుక

image

గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.