News July 31, 2024
మంగళగిరి TDP ఆఫీసుపై దాడి..ముగ్గురు పోలీసులపై వేటు
మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై గత ప్రభుత్వంలో దాడి జరిగింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. సీఐ, ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేశారు. అల్లరి మూకల దాడి అరికట్టలేకపోయారని, దాడి తర్వాత కనీస ఆధారాలు సేకరించలేకపోయారని అప్పటి రూరల్ సీఐ భూషణం, ఎస్సైలు లోకేశ్, క్రాంతి కిరణ్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 29, 2024
నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
వైసీపీ మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మరియమ్మ హత్య ఘటనలో నందిగం సురేశ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్ వెళ్లారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నందిగం సురేశ్ 78వ నిందితుడిగా ఉన్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
News November 29, 2024
ఈనెల 30న మంగళగిరిలో జాబ్ మేళా
ఈనెల 30న మంగళగిరిలోని VJ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్‌మేళాకు 9 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10 నుంచి పీజీ, డిప్లొమా, బీటెక్, ఐఐటీ, ఇంటర్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన వారికి సూమారు రూ.20వేల జీతం ఉంటుందన్నారు.
News November 29, 2024
చేబ్రోలు: బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్
చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న శైలజ(13)ను జులై 15వ తేదీన నాగరాజు అనే వ్యక్తి హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు గత నాలుగు నెలలుగా నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. ఈమేరకు గురువారం నిందితుడిని రాజమండ్రి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.