News March 21, 2025

మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలి: కలెక్టర్

image

జిల్లాలో వారంలోగా మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Similar News

News November 5, 2025

NTR: గురుకుల విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌

image

ఇంటర్ చదివి, నీట్ పరీక్ష రాసిన ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, ఏపీటీడబ్ల్యూఆర్‌ గురుకులాల విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని NTR జిల్లా DCO ఎ. మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సబ్జెక్టు నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 5, 2025

ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

image

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్‌ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్‌ఛైర్‌లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.

News November 5, 2025

HYD: రేవంత్ రెడ్డికి KTR కౌంటర్

image

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ రోడ్ షోలో సీఎం వ్యాఖ్యలకు KTR స్పందించారు. ‘భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 25-28 ద్వారా మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. దీనికి అంబేడ్కర్ కృషి చేశారు. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా పాటించడానికి, ప్రచారం చేయడానికి ఈ హక్కు అనుమతిస్తుంది. ​రాజకీయ చర్చలతో లౌకిక రాజ్యమైన భారత్ గొప్పతనాన్ని అపహాస్యం చేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.