News October 10, 2025
మంచిర్యాలలో ఈ నెల 13న ప్రజావాణి

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణిని ఈ నెల 13 నుంచి యథావిధిగా కొనసాగించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో ప్రజావాణి యథావిధిగా ఉంటుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 10, 2025
గచ్చిబౌలిలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేస్ క్యాన్సర్ రన్ నేపథ్యంలో ఆదివారం గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.5:30 నుంచి 8:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. 10 కిలోమీటర్ల ఈ పరుగు గచ్చిబౌలి మెయిన్ స్టేడియం నుంచి IIIT జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా సాగుతుందన్నారు. విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను వేరే దారిలో మళ్లించనున్నట్లు తెలిపారు.
News October 10, 2025
దుకాణాలు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేయాలి: అనిల్ కుమార్

దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. టపాసులు అమ్మే ప్రదేశంలో దుకాణదారులు ఫైర్, విద్యుత్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలని, తగిన రక్షణలతో అమ్మకాలు కొనసాగించాలని ఆయన సూచించారు.
News October 10, 2025
గ్రూప్-1 ర్యాంకర్‌ను సన్మానించిన HYD కలెక్టర్

గ్రూప్-1 ద్వారా ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌గా ధనసిరి దివ్య ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవారం లక్డికాపూల్‌లోని కలెక్టరేట్‌లో ఆమెను సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగ సాధన అభినందించి, దివ్యని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.