News December 18, 2025

మంచిర్యాలలో ఎక్కువ.. ఆసిఫాబాద్‌లో తక్కువ!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 87.78 శాతం పోలింగ్‌తో మంచిర్యాల జిల్లా ముందు వరుసలో నిలిచింది. అదిలాబాద్ జిల్లాలో 86.94%, నిర్మల్ జిల్లాలో 84.99%, ఆసిఫాబాద్ జిల్లాలో 83.32%, పోలింగ్ నమోదు అయ్యింది. 20 మండలాల్లో జరిగిన 3వ విడతలో 3,97,259 ఓటర్లుండగా, వారిలో 3.34 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Similar News

News December 19, 2025

రాజమండ్రి: 21న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

తూర్పుగోదావరి జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక ఈనెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎస్.కే.వి.టి డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా 85 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు.

News December 19, 2025

VZM: ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్థులు ఈనెల 20న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద శిక్షణ నిమిత్తం హాజరుకావాలని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 22 నుంచి 9 నెలల శిక్షణ ప్రారంభం కానుండగా.. పురుషులను డీటీసీ చిత్తూరు, మహిళలను పీటీసీ ఒంగోలుకు పంపిస్తామన్నారు. అవసరమైన పత్రాలు, రూ.10,000 కాషన్ డిపాజిట్‌, లగేజీతో రావాలని, బంధువులకు అనుమతి లేదన్నారు.

News December 19, 2025

ఏపీ ఈపీడీసీఎల్‌కు జాతీయస్థాయి అవార్డు

image

పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో ‘భారతరత్న శ్రీ అటల్ బీహారీ వాజపేయి జాతీయ అవార్డు’ను ఏపీఈపీడీసీఎల్ సాధించింది. 23 వేల గిరిజన కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు.