News April 7, 2025
మంచిర్యాలలో ఏడుగురు అరెస్ట్

మంచిర్యాలలోని తిలక్‌నగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చెట్ల పొదల్లో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో గోదార్ల రమేష్, దేవసాని కుమార్, ఆటకారి శ్రీను, వనం లక్ష్మన్, మాచర్ల వెంకటేష్, తోకల శ్రీనివాస్, గౌరీ ప్రసాద్ ఉన్నారు. వారి నుంచి రూ.2,100 నగదు, 4 మొబైల్స్, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News July 6, 2025
భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
News July 6, 2025
LEAP యాప్‌లో పొందుపరచాలి: కలెక్టర్

ఈనెల 10న ఏలూరు జిల్లాలో జరిగే మెగా పేరెంట్స్ మీట్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో ఆమె ఏర్పాట్లను సమీక్షించారు. ‘LEAP యాప్’లో కార్యక్రమ వివరాలను పొందుపరచాలని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య నివేదికలను అందించాలన్నారు. మానసిక ఆరోగ్యం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వ్యతిరేకత, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు.
News July 6, 2025
కోటపల్లి: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

కోటపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్వోఆర్ వాటర్ ప్లాంట్‌ను రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.