News January 25, 2026
మంచిర్యాలలో చెదురుతున్న గులాబీ గూడు..!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగులుతుంది. ఇద్దరు మాజీ కౌన్సిలర్లు శుక్రవారం బీజేపీలో చేరగా శనివారం మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీపతి వాసు, కొందరు పట్టణ స్థాయి నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో టికెట్లు దాదాపు ఖరారు అయినప్పటికీ వారు పార్టీ వీడటం నాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఎన్నికల సమయంలో ఇంకెందరు పార్టీకి ఝలక్ ఇస్తారో అని తర్జనభర్జన పడుతున్నారు.
Similar News
News February 20, 2026
ఏయూ గేటు వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

ఆంధ్రా యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ యూనివర్సిటీ గేటు ముందు నిరసన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడడం తప్పా.. భారతమాతకు జై అనడం తప్పా.. అంటూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. వీసీకి ఫిర్యాదు చేయాలే గానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేయడం తగదన్నారు. వారిని అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు.
News February 20, 2026
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: డీఐఈఓ

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను బోర్డు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
News February 20, 2026
రాష్ట్రంలో వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని RTGS అంచనా వేసింది. సెంట్రల్ ఆంధ్ర, ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.


