News February 14, 2026

మంచిర్యాలలో జనసేన బోణీ

image

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. 34వ డివిజన్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి సాగర్ తన సమీప ప్రత్యర్థిపై 31 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాగర్ విజయం సాధించడంతో జనసైనికులు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

Similar News

News February 15, 2026

వినాయకుడిని అంజి.. అని పిలుస్తారని తెలుసా…!

image

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలోని అగస్త్య గోపురం సమీపంలో పంచసంథి వినాయక ఆలయం ఉంది. ఈ వినాయకుడిని తమిళులు అంజి… అంజి పిలుస్తారు. పూర్వం గ్రామంలోని తగువులు ఈ ఆలయంలో పరిష్కారం చేసేవారిని పుస్తకాల్లో లిఖితపూర్వకంగా ఉంది.

News February 15, 2026

పాలమూరు: విద్యార్థులకు అలెర్ట్.. హాల్ టికెట్ డౌన్‌లోడ్

image

ఈ నెల 22 ఆదివారం 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమన్వయకర్త వాణిశ్రీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19 కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. 6432 మంది విద్యార్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. బ్లాక్ అండ్ బ్లూ పెన్, పరీక్షప్యాడ్, ఆధార్ కార్డ్ తీసుకురావాలన్నారు.

News February 15, 2026

వర్ని: అన్నను చంపిన తమ్ముడు

image

వర్ని మండలం వడ్డేపల్లిలో కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎత్తరి సాయిబాబా(32)ను అతని తమ్ముడు రాంబాబు కర్రతో తలపై కొట్టి హత్య చేసినట్లు వర్ని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం తల్లి మృతి చెందింది. ఆమె మృతికి అన్న సాయిబాబా కారణమని అనుమానంతో తమ్ముడు రాంబాబు అన్నను హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.