News July 28, 2024
మంచిర్యాలలో రోడ్డుప్రమాదం.. ఇద్దరి మృతి

శుక్రవారం మంచిర్యాల ఏసీసీ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన రాజు(30) శుక్రవారం రాత్రి ఏసీసీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో నస్పూర్‌కు చెందిన వినయ్‌కుమార్(27) బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. వినయ్‌కుమార్ శనివారం HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News February 7, 2026
ADB: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

క్రీడా రంగాల్లో రాణించడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు శుక్రవారం ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.

News February 6, 2026
ఆదిలాబాద్: POLYCETకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు బీ.సాయన్న సూచించారు. POLYCET ప్రవేశ పరీక్ష గురించి ఇచ్చోడ, బజరత్నుర్, జాతర్ల, పిప్రి, సోనాల పార్ది బీ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కల్పించారు. పదో తరగతి విద్యార్థులకు పాలిటెక్నిక్ గురించి వివరించారు. పాలిసెట్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం గురించి వివరించారు.