News November 13, 2024
మంచిర్యాలలో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జాఫర్ నగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు SI సనత్ తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రమీనా హుస్సేన్ సోమవారం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోకు వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబీకులు తలుపులు పగలగొట్టి చూడగా బాలిక ఇంట్లో ఉరేసుకొని ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై SI కేసు నమోదు చేశారు.
Similar News
News September 18, 2025
ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్‌లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్‌లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్‌ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్: పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

ఆదిలాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.