News April 23, 2025
మంచిర్యాల అమ్మాయికి స్టేట్ 2nd Rank

ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో చెన్నూర్ పట్టణానికి చెందిన పబ్బ సంజన సత్తా చాటింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470కి 467 మార్కులు రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించింది. పబ్బ స్రవంతి, సుధాకర్ దంపతుల కూతురు సంజన రాష్ట్రస్థాయిలో ర్యాంక్ సాధించడంపై పలువురు అభినందించారు.
Similar News
News April 23, 2025
వెల్దుర్తి: భూవివాదంలో వ్యక్తిపై కత్తితో దాడి

పొలం వివాదంలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన జయరాములు అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కానికే రవి పాత గొడవలు మనసులో పెట్టుకుని పొలం వివాదంలో రాత్రి కత్తితో దాడి చేశారు. దీంతో గాయాలైన జయరాములు బంధువులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు.
News April 23, 2025
కోడూరు: ఫోక్సో కేసులో యువకుడి అరెస్టు

కోడూరు మండలం రాఘవ రాజాపురం హరిజనవాడకు చెందిన కూని వెంకటేశ్(శివమణి)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని మంగళవారం అరెస్టు చేశామని సీఐ హేమ సుందర్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. కోడూరు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
News April 23, 2025
చంద్రబాబే లిక్కర్ స్కాం చేశారు: తాటిపర్తి

లిక్కర్ స్కాంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసలు లిక్కర్ స్కాం ఎవరు చేశారు? 2014-19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కాం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబే స్కాం చేశారని రాష్ట్రప్రభుత్వానికి చెందిన సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు ఏమైంది? ఎందుకు నడవడం లేదు? ’ అని ఎమ్మెల్యే తాటిపర్తి ట్వీట్ చేశారు.