News December 28, 2024
మంచిర్యాల: ఆన్‌లైన్ గేమ్‌లో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి
ఆన్‌లైన్ గేమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో మంచిర్యాల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ PS SHO, DSP వెంకటరమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.1,36,96,290మోసపోయానని తమకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు చేయగా నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం అని తెలిసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News December 29, 2024
నిర్మల్‌లో మహిళపై అత్యాచారం.. వివరాలు వెల్లడించిన సీఐ
నిర్మల్‌లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వివరాలను టౌన్ సీఐ శనివారం వెల్లడించారు. శుక్రవారం బస్టాండ్‌లో కానిస్టేబుల్ అనిల్ విధులు నిర్వహిస్తుండగా ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉన్న మహిళ వివరాలు తెలపారు. వారు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను యోగేష్ అనే వ్యక్తి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలుపగా కేసు నమోదు చేశామన్నారు.
News December 29, 2024
‘గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విజయ డెయిరీ కేంద్రాలు’: ADB కలెక్టర్
తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 85, పట్టణ ప్రాంతాల్లో 25 విజయ పాల విక్రయ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కేంద్రాలకు విజయ సఖి పేరుతోనడుపుతున్నామన్నారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయ సఖి నమూనా ఫ్రిడ్జ్‌ను ఆయన ఆవిష్కరించారు. డెయిరీ డిడి మధుసూదన్ తదితరులు ఉన్నారు.
News December 29, 2024
సిర్పూర్(టి): పెద్దపులి సంచారం కలకలం
సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్‌లోని ప్లాంటేషన్లో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించి గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఉదయం 10 దాటాక వెళ్లి సాయంత్రం 4 లోపే ఇంటికి చేరుకోవాలన్నారు.