News February 2, 2025
మంచిర్యాల: ఆపరేషన్ స్మైల్‌లో 88 మంది బాలలకు విముక్తి

అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-lX విజయవంతమైందని CPశ్రీనివాస్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా కమిషనరేట్ పరిధిలో 88 మంది బాలలకు విముక్తి కలిగించినట్లు తెలిపారు. CP మాట్లాడుతూ.. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ నిరంతరం నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 18, 2026
మంగళగిరి-తెనాలి రోడ్డు విస్తరణ

మంగళగిరి-తెనాలి రోడ్డును రూ.16.93 కోట్లతో 60 అడుగులకు విస్తరించనున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో ఖబరస్థాన్‌కు ఇబ్బంది లేకుండా ‘కాంటిలివర్’ పద్ధతిలో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనుల్లో 105 కట్టడాలు (28 పూర్తిగా, 77 పాక్షికంగా) ప్రభావితమవుతాయి. నిర్వాసితులకు రూ.12.5 కోట్ల పరిహారం, రూ.40 కోట్ల విలువైన TDR బాండ్లు (1:4 నిష్పత్తిలో) ఇవ్వనున్నారు. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.
News February 18, 2026
పాడేరు: ‘పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు’

పింఛన్ పంపిణీలో అలసత్వం వహించకూడదని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పింఛన్ పంపిణీలో అవకతవకలు జరిగితే ఎంతటి అధికారికైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెండు జిల్లాల అధికారులతో వీసీ నిర్వహించారు. పింఛన్ పంపిణీలో ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే కాల్స్‌లో, లబ్దిదారులకు ఏ విధమైన ప్రశ్నకు సంతృప్తి చెందితే సమాధానంగా ఏ బటన్ ప్రెస్ చెయ్యాలో తెలియజేయాలని సూచించారు.
News February 18, 2026
ప్రమాదానికి ఏడాది.. మళ్లీ పనులు మొదలు

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(SLBC) తవ్వకం మళ్లీ మొదలైంది. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపట్టారు. గతేడాది ఫిబ్రవరిలో టీబీఎం మెషీన్‌తో తవ్వకాలు జరుపుతుండగా టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. దీంతో మెషీన్ తవ్వకాలు నిలిపివేసి బ్లాస్టింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించి పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.


