News October 22, 2025
మంచిర్యాల: ఆరు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 23, 24, 26, 27, 28, 29 తేదీల్లో ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్‌ల మీదుగా వెళ్తాయి. ఫస్ట్ ఏసీ నుంచి జనరల్ క్లాస్ వరకు అన్ని సౌకర్యాలతో రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
సీతంపేటలో నేతకాని బతుకమ్మ ప్రారంభం

HNK జిల్లా సీతంపేటలో నేతకాని కులస్థుల దీపావళి బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులు చేరడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఫస్ట్ రోజు ఉపవాస దీక్షతో రేగడి మట్టిని సేకరించి జోడెద్దుల విగ్రహ ప్రతిమలు తయారు చేస్తారు. పిండి వంటలతో నగలతో అలంకరించి కేదారీశ్వరస్వామి వ్రతం నిర్వహిస్తారు. రెండో రోజు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.
News October 22, 2025
NLG: ఆ ఊరిలో ఒక్క బెల్టు షాపు లేదు

తిప్పర్తి మండలంలోని కాశివారిగూడెం గ్రామం ఒక్క బెల్టు షాపు కూడా లేని ఆదర్శంగా నిలిచింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకమై గ్రామంలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించి, కఠిన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామం ప్రశాంతంగా, శుభ్రంగా మారింది. స్వచ్ఛమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న కాశివారిగూడెం గ్రామం, ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
News October 22, 2025
మహబూబ్‌నగర్: కురుమూర్తి రాయుడి పేరు వెనుక కథ ఇదీ..!

కురుమూర్తి క్షేత్రంలో కొలువైన శ్రీహరి పేరుకు మూలం కురుమతి అని పండితులు భావిస్తున్నారు. “కురు” అనగా ‘చేయుట’, “మతి” అనగా ‘తలచుట’ అని అర్థం. అంటే, కోరిన కోరికలు తీర్చే తలంపు ఈ క్షేత్రానికి ఉందని అర్థం. కాలక్రమంలో ఈ పేరు “కురుమూర్తి”గా మారిందని, ఇక్కడ శ్రీహరి మూర్తి రూపంలో స్వయంగా కొలువై ఉండటంతో ఈ పేరు ప్రసిద్ధి చెందిందని సాహిత్యకారులు విశ్లేషిస్తున్నారు. నేడు స్వామివారి కళ్యాణం జరిగింది.