News January 19, 2026

మంచిర్యాల: ఆ ముగ్గురు ఎవరు..?

image

జిల్లాలోని 302 గ్రామపంచాయతీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ప్రతి పంచాయతీకి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండటంతో రాజకీయ సందడి మొదలైంది. ముఖ్యంగా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈ పదవుల ద్వారా ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. 306 పంచాయతీలు ఉన్న జిల్లాలో, ఎన్నికలు ముగిసిన చోట్ల ఆశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు ముమ్మరం చేశారు.

Similar News

News April 14, 2026

అన్నమయ్య జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం పర్యటన

image

జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న అన్నమయ్య జిల్లాకు రానుందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించనుంది. జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న జలధార ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం “జలధార -జలహారతి” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనుకుంటోందన్నారు.

News April 14, 2026

భద్రాద్రి జిల్లాలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 12,728 మంది విద్యార్థులకు గాను 12,699 మంది హాజరయ్యారని, 99.77 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. కేవలం 29 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. చివరి రోజు కలెక్టర్‌ అంకిత్‌ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలు ముగియడంతో గురుకులాలు, హాస్టళ్ల నుంచి విద్యార్థులు తమ సామగ్రితో ఇళ్లకు బయలుదేరారు.

News April 14, 2026

ఏడేళ్ల తర్వాత ‘ఇంటి పన్ను’ లెక్కలు షురూ!

image

జిల్లాలో గ్రామ పంచాయతీల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంటి పన్నుల పునఃమదింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2018లో చివరిసారిగా జరిగిన ఈ ప్రక్రియ, మళ్లీ ఇప్పుడు పట్టాలెక్కుతోంది. ఇండ్ల కొలతలు, నిర్మాణాల్లో మార్పులు, కొత్తగా నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. 849 పంచాయతీల్లో ఈ ప్రక్రియ ద్వారా అదనంగా సుమారు రూ.2 కోట్లు ఆదాయం రానున్నది.