News January 3, 2026

మంచిర్యాల: ఆ మున్సిపాలిటీకి ఎన్నికలెప్పుడు..?

image

మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడి 3 దశాబ్దాలవుతున్నా నేటికీ ఎన్నికలు జరగకపోవడం గమనార్హం. 1995లో మున్సిపాలిటీ ఏర్పడినా రిజర్వేషన్ల వివాదంతో 1998లో కోర్టు స్టే కారణంగా ఎన్నికలు ఆగిపోయాయి. అప్పటి నుంచి త్రిసభ్య కమిటీ పాలనలోనే కాలం వెళ్లదీస్తోంది. ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వాలు హామీలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి.

Similar News

News February 10, 2026

యాదాద్రి: ఈనెల 12 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

image

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 12 నుంచి శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు. అందులో 12న స్వస్తి వచనం, 13న ధ్వజారోహణం, దేవతాహ్వానం, 14న రుద్రహవనం, శివపార్వతుల కళ్యాణం, 15న మహాశివరాత్రి, శతరుద్రాభికాలు, 16న లక్ష బీల్వార్చన, రథోత్సవం, 17న పూర్ణాహుతి, త్రిశూల తీర్థతో ఉత్సవాలు ముగియనున్నాయి.

News February 10, 2026

డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ యత్నం.. ఉద్రిక్తత

image

HYDలో డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. మక్తల్‌లో ఆరో వార్డు అభ్యర్థి మహదేవప్ప <<19098651>>ఆత్మహత్య<<>> చేసుకోవడంపై కమలం నేతలు ఆందోళనకు దిగారు. అతడి మరణానికి కాంగ్రెస్ పార్టీ వేధింపులే కారణమని నిరసన చేపట్టారు. డీజీపీ ఆఫీసులోకి దూసుకెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News February 10, 2026

జగన్‌కు జెడ్ ప్లస్ భద్రతను కల్పించాలి: వైసీపీ

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ రాసింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జగన్ పర్యటనల్లో పోలీసులు ఇష్టమొచ్చినట్లుగా చివరి నిమిషంలో రూట్లు మారుస్తున్నారని ఆరోపించింది. ఇటీవల తలెత్తిన భద్రతా లోపాలను ప్రస్తావిస్తూ వాటిపై విచారణ చేపట్టాలని కోరింది.