News October 19, 2025

మంచిర్యాల: ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సంబంధిత అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు, ఆస్తిపన్నులు వసూలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మునిసిపల్ పరిధిలో ఆస్తిపన్ను 100% వసూలు చేయాలన్నారు.

Similar News

News October 19, 2025

కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు..!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరలు గత వారం మాదిరిగానే స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో మటన్ ధర రూ.800గా ఉంది. కిలో చికెన్ స్కిన్ లెస్ రూ.240, లైవ్ కోడి ధర కిలో రూ.160గా విక్రయిస్తున్నారు. మాంసం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.

News October 19, 2025

ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్‌లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్‌లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.

News October 19, 2025

ఆసీస్‌పై పైచేయి సాధిస్తామా?

image

నేడు భారత్, AUS మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 152సార్లు తలపడగా ఆసీస్ 84 మ్యాచుల్లో గెలిచి ఆధిపత్యం చెలాయిస్తోంది. అటు ఆ దేశంలోనూ మన రికార్డ్ పేలవంగానే ఉంది. 54 వన్డేల్లో కేవలం 14సార్లే మనం గెలిచాం. ఈ క్రమంలో తాజా సిరీస్‌ను కైవసం చేసుకొని పైచేయి సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇవాళ తొలి వన్డే జరిగే పెర్త్‌లో పరుగులు రాబట్టడం కష్టమే అని క్రీడా విశ్లేషకుల అంచనా.