News December 23, 2025
మంచిర్యాల: ఈనెల 23న నమోదు, లైసెన్స్ మేళా

జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వహణ కోసం fssia నమోదు,లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా ఆహార తనిఖీ అధికారి వాసురామ్ తెలిపారు. fssia చట్టం ప్రకారం ప్రతి ఆహార వ్యాపారి లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, లేనివారికి రూ.5లక్షల జరిమానా, 6నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాన్ కార్డు, జీఎస్టీ ట్రేడ్ లైసెన్స్, రెంటల్ అగ్రిమెంట్ తీసుకురావాలన్నారు.
Similar News
News December 25, 2025
అన్నమయ్య జిల్లాలో నలుగురు ఎస్ఐలు బదిలీ: ఎస్పీ

అన్నమయ్య జిల్లాలో నలుగురు SIలను బదిలీ చేస్తూ జిల్లా SP ధీరజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దమండ్యం SI వెంకటేశ్వర్లును DCRBకి, తంబళ్లపల్లి ఎస్ఐ ఉమామహేశ్వర్ రెడ్డిని రామసముద్రానికి, మదనపల్లె 1 టౌన్ ఎస్ఐ అన్సర్ బాషాను జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కు, రామసముద్రం SI దిలీప్ కుమార్‌ను మదనపల్లె 1 టౌన్‌కు బదిలీ చేశారు.
News December 25, 2025
కోహ్లీ క్రేజ్.. VHT స్కోర్ కోసం 10 లక్షల సెర్చ్‌లు

కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లు ఆడుతున్న విజయ్ హజారే ట్రోఫీ ప్రత్యక్ష ప్రసారం లేకపోవడంతో అభిమానులు గూగుల్‌ను ఆశ్రయించారు. ముఖ్యంగా కోహ్లీ లైవ్ స్కోర్ తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. 10 గంటల వ్యవధిలో ఢిల్లీ-ఆంధ్రా మ్యాచ్ అప్డేట్స్ కోసం 10 లక్షలకు పైగా సెర్చ్‌లు నమోదయ్యాయి. ఏకంగా 1,81,818 సార్లు రీఫ్రెష్ చేశారు. నిన్నటి మ్యాచ్‌లో కింగ్ 101 బంతుల్లో 131 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
News December 25, 2025
విశాఖ వుడా మాజీ అధికారి ఆస్తులు ఈడీ అటాచ్!

విశాఖ వుడా మాజీ అదనపు చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న రూ.1.09 కోట్ల విలువైన ఆస్తులు ఎటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. 2002లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పసుపర్తి ప్రదీప్‌కుమార్‌పై దాడులు నిర్వహించి ఈడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆస్తులు జప్తు చేశారని తెలిపారు. జప్తు చేసిన వాటిలో ప్రదీప్‌కుమార్, ఆయన భార్య పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు ఉన్నాయి.


