News December 9, 2025
మంచిర్యాల: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని 90 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Similar News
News December 11, 2025
వేములవాడ: పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 76 సర్పంచ్, 519 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు.
News December 11, 2025
KMR: రేపటి పోలింగ్ కోసం సర్వం సిద్ధం

కామారెడ్డి జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం 10 మండలాల్లో జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం, ఎన్నికల అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎన్నికల సామగ్రితో కూడిన వాహనాలు ఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరాయి. సిబ్బంది రాత్రికి కేంద్రాల్లోనే బస చేసి, రేపటి పోలింగ్ ప్రక్రియకు సిద్ధమవుతున్నారు.
News December 10, 2025
US వెళ్లేందుకు వారు ఐదేళ్ల SM హిస్టరీ ఇవ్వాలి!

UK సహా వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లే వాళ్లు ఇకపై ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. వీసా అవసరంలేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ రూల్ తప్పనిసరి చేసేలా US ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుతో యూరప్, AUS, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, ఖతర్, ఇజ్రాయెల్ వంటి 40 దేశాలపై ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 90 డేస్ అమెరికాలో ఉండొచ్చు.


