News March 27, 2025
మంచిర్యాల: ఈ నెల 28న మినీ జాబ్ మేళా

మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న ఉదయం10.30గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. అపోలో ఫార్మసీ మంచిర్యాల, గోదావరిఖని, హైదరాబాద్‌లో ఫార్మసిస్ట్ 40, ట్రైనింగ్ ఫార్మాసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్10ఖాళీలు ఉన్నాయన్నారు.18నుంచి 35లోపు వయస్సు, అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 30, 2025
విశాఖలో క్రికెట్ మ్యాచ్ చూసిన ప్రముఖులు

విశాఖపట్నంలో ఆదివారం జరిగిన ఢిల్లీ- సన్ రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్‌ను దేశ, రాష్ట్ర ప్రముఖులు వీక్షించారు. వీక్షించిన వారిలో ఐసీసీ ఛైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.
News March 30, 2025
ముంబై, చెన్నైల పని అయిపోయిందా?

IPLలో ఒక్క ట్రోఫీ గెలిస్తేనే గొప్ప. అలాంటిది ముంబై, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఇదంతా గతం. రోహిత్, ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమయ్యాక ఈ రెండు ఫ్రాంచైజీల పరిస్థితి దారుణంగా తయారైంది. 200కు పైగా స్కోర్లను అలవోకగా ఛేదించే ఈ జట్లలో ఇప్పుడు గెలవాలన్న కసి కనిపించట్లేదు. మొన్న RCBపై చెన్నై, నిన్న GTపై ముంబై బ్యాటింగ్ చూసి.. ఆ జట్ల పని అయిపోయినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. COMMENT?