News November 26, 2025
మంచిర్యాల: ఈ నెల 29న దివ్యాంగుల ఆటల పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం- 2025ను పురస్కరించుకొని దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలను ఈ నెల 29న మంచిర్యాల ZPHS మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని జూనియర్, సీనియర్ దివ్యాంగులందరికీ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు సదరం, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.
Similar News
News November 28, 2025
బాపట్ల జిల్లాపై తుఫాన్ ప్రభావం..!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో బాపట్ల జిల్లాలో ఈనెల 29 నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ కార్యాలయం గురువారం ఓ మ్యాప్ విడుదల చేసింది. తుఫాన్ ప్రభావం వలన ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
News November 28, 2025
సిద్దిపేట: బాండ్‌పై సంతకం పెట్టి పోటీ చేయ్!

SDPT జిల్లా నంగునూర్ మం.లో సర్పంచ్‌లుగా పోటీచేస్తున్న ఆశావహులకు బాండ్ పేపర్ సవాల్ విసురుతోంది. వాట్సాప్ గ్రూప్‌లలో యువకులు బాండ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిపిస్తే 5ఏళ్లలో తన కుటుంబ ఆస్తులు పెరిగితే పంచాయతీ జప్తు చేసుకోవచ్చని, పనుల కోసం వచ్చే ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయనని, జీపీ సొమ్మును అక్రమంగా ఖర్చు చేయనని, తప్పుడు లెక్కలు చూపనని సంతకం చేసి ఓట్లు అడగాలని బాండ్‌లో పేర్కొన్నారు.
News November 28, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం కేసులో ముద్దాయికి జైలు శిక్ష

కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధురాలిపై 2024 ఆగస్టు 29న అత్యాచారయత్నం చేసిన కేసులో 7వ అదనపు జిల్లా జడ్జి స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ముద్దాయి వెంకటరమణకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్ఐ సునీత తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.


