News February 15, 2025

మంచిర్యాల: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ ఎక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News November 7, 2025

BREAKING: వికారాబాద్ జిల్లాలో దారుణం

image

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ సీఐ వెంకట్ తెలిపారు. శుక్రవారం మర్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ వహేద్, అదే గ్రామానికి చెందిన బాలికను హాస్టల్‌లో దింపేందుకు తీసుకెళ్లాడన్నారు. మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి అడవిలో మరో వ్యక్తి నర్సింహులు సహకారంతో అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. వారిని అరెస్ట్ చేశారు.

News November 7, 2025

ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

image

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.

News November 7, 2025

పెద్దపల్లి: ‘ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలి’

image

PDPL జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను 100% గ్రౌండ్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. PDPL నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, 800కి పైగా ఇండ్లు ఇంకా మార్కింగ్ కాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆసక్తిలేని లబ్ధిదారుల ఇండ్లు రద్దుచేయాలని, అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలన్నారు. నిర్మాణపనులు వేగవంతం చేసి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని తెలిపారు