News April 17, 2025
మంచిర్యాల: ఒకరి అరెస్ట్.. ఇద్దరు పరార్

మంచిర్యాల జిల్లాకేంద్రంలోని బాయ్స్ హైస్కూల్ ఏరియాలో గంజాయి కలిగి ఉన్న ముగ్గురిలో ఒకరిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లగా ఇద్దరు పారిపోయారు. మాడవి జీవన్ జాషువాను పట్టుకున్నారు. అతడి నుంచి 1.080కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు పంపించారు.
Similar News
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.
News April 19, 2025
నేడు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

AP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(GVMC) మేయర్ జి. హరి వెంకట కుమారిపై నేడు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన ఉ.11కు కౌన్సిల్ సమావేశం కానుంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు తమ వద్ద 74మంది కార్పొరేటర్లు ఉన్నారని కూటమి నేతలు ధీమాగా ఉండగా, విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని YCP తమ కార్పొరేటర్లను హెచ్చరించింది.
News April 19, 2025
నాగర్‌కర్నూల్: ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి’

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘం జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడారు. వరి కోతలు ప్రారంభమై పది రోజులు దాటినా జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.