News December 31, 2025
మంచిర్యాల కలెక్టర్‌పై ఆరోపణలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జల పుష్కరాలలో జల సంచయ్ జన్ భాగిదారీ విభాగంలో జిల్లాకు జాతీయస్థాయి అవార్డుతో పాటు రూ.2కోట్ల నగదు బహుమతి వచ్చింది. ఈ విషయంపై పలువురు కలెక్టర్‌పై ఆరోపణలు చేశారు. నకిలీ ఫోటోలు అప్ లోడ్ చేయడం ద్వారా అవార్డు వచ్చిందని, అసలు పని జరగలేదని అంటున్నారు.
Similar News
News February 21, 2026
కర్నూలు: ఫేస్‌బుక్ పరిచయం.. ప్రాణం తీసుకున్న యువకుడు

ఫేస్‌బుక్ పరిచయంతో మహిళపై వ్యామోహం పెంచుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పత్తికొండలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరుకు చెందిన అశోక్(26)కు పత్తికొండకు చెందిన దంపతులు FBలో పరిచయమయ్యారు. చెన్నైలో తనకు హోటల్ ఉందని, కర్నూలులో పెట్టే హోటల్‌లో భాగస్వాములు కావాలని నమ్మబలికిన యువకుడు పత్తికొండకు వచ్చాడు. అనంతరం తనతో రావాలంటూ మహిళను వేధించగా ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 21, 2026
ప.గో: ఉగాది గిఫ్ట్.. మరో DSC నోటిఫికేషన్!

ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 900 పైచిలుకు పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 200 ఖాళీల భర్తీకి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ఉపాధ్యాయ కొలువే లక్ష్యంగా ఉమ్మడి ప.గో. అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెడుతున్నారు.
News February 21, 2026
నల్లగొండ: 14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్లగొండ 5వ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్లగొండ, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సంతోష్ సూచించారు.


