News January 24, 2026

మంచిర్యాల: కార్పొరేటర్ టికెట్ @రూ.50లక్షలు

image

కొత్తగా ఏర్పడిన MNCL కార్పొరేషన్‌లో కార్పొరేటర్ పదవి “కోట్ల”తో ముడిపడి ఉంది. రూ.50లక్షలు ఖర్చు చేయగలవారికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. BJP, BRSలు సైతం ఇదే బాటలో నడుస్తున్నాయి. ఒక్కో డివిజన్‌లో 2500 -3500 ఓటర్లు ఉండగా ఓటుకు రూ.1000 పంపిణీ తప్పదని అభ్యర్థులు బేరీజు వేస్తున్నారు. 60 డివిజన్లలో కలిపి ఒక్కో పార్టీ సుమారు రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.

Similar News

News February 12, 2026

సంగారెడ్డి: స్ట్రాంగ్ రూమ్ వద్ద అప్రమత్తంగా ఉండాలి: డీఐజీ

image

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో, బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచే వరకు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ చౌహాన్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించిన ఆయన, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎస్పీ పారితోష్ పంకజ్, టెక్నికల్ టీంను అభినందించారు. బాక్సుల తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

KNR: ‘సమ్మెని విజయవంతం చేయాలి’

image

KNRలో తెలంగాణా మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను కిరణ్ మాట్లాడుతూ.. FEB 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కొత్త లేబర్ చట్టాలు, పలు డిమాండ్లతో దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న మెడికల్ & సేల్స్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.