News October 13, 2025
మంచిర్యాల: కీటక జనిత వ్యాధులపై అవగాహన

జిల్లాలోని ప్రభావిత మండలాల్లో 20 బృందాల ద్వారా ఫైలేరియాని నిర్ధారణ కోసం రాపిడ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య అధికారి డా.అనిత చెప్పారు. మంచిర్యాల మండలం తాళ్లపేట పీహెచ్సీలో సర్వేలో పాల్గొంటున్న బృందాలతో సమీక్ష నిర్వహించారు. కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఫైలేరియా వ్యాధులపై ప్రజల్లో అవగాహన కలిగించాలన్నారు. దోమలు కుట్టకుండా, వృద్ధి చెందకుండా చూడాలన్నారు.
Similar News
News October 13, 2025
మేడ్చల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పౌరసరఫరాల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు సౌకర్యవంతమైన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణం పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణ భాయ్ పాల్గొన్నారు.
News October 13, 2025
రామవరప్పాడులో వ్యక్తి మృతి

విజయవాడ రామవరప్పాడులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఆర్టీసీ కాలనీ నుంచి రామవరప్పాడు పీఎస్ఆర్ కాలనీ వైపు ఓ వృద్ధుడు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఏలూరు వైపు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు.
News October 13, 2025
అవంతి అడుగులు ఎటువైపో?

YCPహయాంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ గంటా శ్రీనివాస్ చేతిలో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. TDP, జనసేనలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. YCPమేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆయన కుమార్తె ప్రియాంక(కార్పొరేటర్)ఓటే కీలకమయ్యిందన్న చర్చ నడిచింది. అయినా కూటమి పార్టీలు అవంతిని పట్టించుకోకపోవడం విశేషం. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇప్పటివరకు 3పార్టీలు మారారు.