News January 30, 2025
మంచిర్యాల: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల ఎంపీడీవో అలీం గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హెల్త్‌చెకప్‌కు HYD వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన స్వస్థలం కాగజ్‌నగర్ మండలం కాగా ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఏడు నెలల్లో పదవీ విరమణ ఉండగా అంతలోనే విషాదం జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 12, 2025
కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డి చెప్పింది ఇదేనా.?

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో TTD మాజీ ఈవో ధర్మారెడ్డిని మంగళవారం సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో తన ప్రమేయం లేదని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. <<18262552>>హైకమాండ్<<>>(బోర్డ్/ పొలిటికల్) నిర్ణయాల మేరకే టెండర్లకు ఆమోదం తెలిపామని, రూల్స్‌కు అనుగుణంగా బోర్డులో నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం.
News November 12, 2025
NZB: డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్షల ఫీజులు చెల్లించని డిగ్రీ విద్యార్థులకు మరో అవకాశం కల్పించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 వరకు రూ.100 అపరాధ రుసుముతో విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లింపుల పత్రాలను ఈ నెల 15 లోపు యూనివర్సిటీలో అందజేయాలని ఆయన సూచించారు.
News November 12, 2025
తాడేపల్లిగూడెం: గడ్డి మందు తాగి..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారంలో నివసిస్తున్న ముప్పడి కార్తీక్ (37) గడ్డి మందు తాగి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో మద్యానికి బానిసై ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి ఇంటి ముందు దొరికిన గడ్డి మందు తాగినట్లు అతని భార్య సునీత రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


