News November 16, 2024

మంచిర్యాల: గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి 

image

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పద్మా నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నివృత్తి (12) అనే బాలిక ఉదయం ఇంట్లో గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంట్లో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అమ్మాయి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో కాలనీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

Similar News

News November 15, 2024

LXPT: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కళ్లు దానం చేసిన కుటుంబ సభ్యులు

image

రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొమ్మిడి అరుణ్ కుమార్ అనే యువకుడి కళ్ల‌ను కుటుంబ సభ్యులు దానం చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ అభిషేక్ సహకారంతో నేత్రాలలోని కార్నియాను సేకరించి హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఛైర్ పర్సన్ వి. మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News November 15, 2024

దిలావర్పూర్: ఒకే గ్రామం నుంచి ఐదుగురికి ఉద్యోగాలు

image

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలానికి చెందిన ఐదుగురు గ్రూప్-4లో ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన కాలేరి మధు (ట్రైజరీ), కుంట రుచిత (ఇంటర్ విద్యా), బొల్ల గంగాధర్ (మున్సిపల్), బెజ్జరాం నవీన్ కుమార్ (రెవిన్యూ) రాజారం గంగ సాగర్ (మున్సిపల్)లో జూనియర్ అసిస్టెంట్‌లుగా ఎంపికయ్యారు. వీరందరిదీ వ్యవసాయ కుటుంబాలు. కాగా వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

News November 15, 2024

ఆదిలాబాద్: గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్లుగా 118 మంది 

image

TGPSC విడుదల చేసిన గ్రూప్-4 ఫలితాలలో జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఆదిలాబాద్ నుంచి 42 మంది వార్డు ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. అలాగే 118 మంది జూనియర్ అసిస్టెంట్లుగా, ఏడుగురు జూనియర్ అకౌంటెంట్లుగా ఎంపికయ్యారు. ఈ ఉద్యోగాలకు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు సైతం ఎంపికయ్యారు. పోస్టులను భర్తీ చేసినట్లయితే జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య భర్తీ అయ్యే అవకాశముంది.