News April 8, 2025
మంచిర్యాల: గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్

గోదావరిలో దూకి వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగింది. మందమర్రికి చెందిన హషాం అహ్మద్(45) సోమవారం రాయపట్నం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. అహ్మద్ కొంతకాలం నుంచి ఫైనాన్స్ విషయంపై బాధపడుతున్నాడన్నారు. మృతుడి తండ్రి మహమ్మద్ అలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News April 17, 2025
రోహిత్, కోహ్లీ, బుమ్రాకు A+ కాంట్రాక్ట్?

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు BCCI A+ కాంట్రాక్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. బోర్డు వర్గాల్ని ఉటంకిస్తూ స్పోర్ట్స్‌తక్ ఈ విషయాన్ని తెలిపింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న అగ్ర క్రికెటర్లకు మాత్రమే బోర్డు A+ గ్రేడ్ కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికారు. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి A+ గ్రేడ్ దక్కుతుందా లేదా అన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.
News April 17, 2025
SUPER.. గిన్నిస్ రికార్డ్ కొట్టిన నారాయణపేట అమ్మాయి

ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన కార్యక్రమంలో కూచిపూడి, భరతనాట్యంలో ప్రతిభ చూపి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన నారాయణపేట నియోజకవర్గం కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామానికి చెందిన జస్వితను బుధవారం నారాయణపేట సీవీఆర్ భవన్‌లో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. చిరు ప్రాయంలోనే ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. పేరెంట్స్ పాల్గొన్నారు.
News April 17, 2025
ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో మార్గదర్శకాలు పాటించాలి: అదనపు కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాలో చేయూత పింఛన్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.