News March 14, 2025

మంచిర్యాల జిల్లాకు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచిర్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ADBలో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News March 14, 2025

జీలుగుమిల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 

image

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీలుగుమిల్లి మండలం టి.గంగన్నగూడెంకు చెందిన కొర్సా సత్తిబాబు (35) మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

News March 14, 2025

తుళ్లూరు: పోలీసులతో పటిష్ట బందోబస్తు

image

వెంకటపాలెంలో రేపు జరగబోవు శ్రీవారి కల్యాణానికి వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. బంధువు పొత్తు నిర్వహణకు వీలుగా సభా ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించి ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను ఇన్‌ఛార్జ్ లుగా నియమించామని చెప్పారు.

News March 14, 2025

నాతవరంలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

నాతవరం మండలం చిక్కుడుపాలెం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన పెదపాత్రుని సత్తిబాబు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భీమరాజు ఘటనా స్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!