News December 23, 2025

మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి

image

10 రోజులుగా మేడిపల్లి ఓసీపీతోపాటు గోలివాడ, మల్యాలపల్లి, మల్కాపూర్‌ శివారుల్లో పెద్ద పులి సంచరించిన విషయం విధితమే. ఈ రోజు మల్కాపూర్‌ గ్రామ శివారు గోదావరి నది మీదుగా మంచిర్యాల జిల్లా ఇందారం ఏరియాలోకి పెద్ద పులి వెళ్లింది. స్థానిక గోదావరిలో పెద్ద పులి పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్‌ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పెద్ద పులి సంచారంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు దీంతో ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News December 23, 2025

ప్రమాదంలో బాపట్ల జిల్లా రిటైర్డ్ జవాన్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి చెందిన ఘటన బాపట్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ముక్తాయపాలెంకు చెందిన రిటైర్డ్ జవాన్ శ్రీనివాస వరప్రసాద్ సూర్యలంక రహదారిలో చింతావారిపాలెం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 23, 2025

మోటకొండూరు: పోరాడితేనే హక్కులను సాధించుకోగలం: కవిత

image

పోరాడితేనే హక్కులను సాధించుకోగలమని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జన జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా మంగళవారం యాదాద్రి జిల్లా మోటకొండూరులో ఆమె మాట్లాడారు. భూ నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదన్నారు. రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు.

News December 23, 2025

SRCL: మాదకద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేష్‌ బి.గీతేతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ రవాణా, వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, యువత మత్తుకు బానిస కాకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.